చిన్నారి అనుమానాస్పద మృతి

X
By - TV5 Telugu |8 Nov 2019 11:35 AM IST
చిత్తూరు జిల్లా కురబాల కోటలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిణి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్వాణమండపంలో సరదాగా ఆడుకుంటూ కనిపించిన వర్షిణి అర్థరాత్రి కనిపించకుండా పోయింది. తెల్లవార్లూ వెతికినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. ఉదయం కళ్యాణమండపం సమీపంలోనే వర్షిణి విగతజీవిగా పడి ఉంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com