అయోధ్య కేసు.. శనివారం ఉదయం 10.30కి తుది తీర్పు

supreme

కోట్లాదిమంది ఉత్కంఠ ఎదురుచూస్తున్న చారిత్రాత్మక తీర్పు శనివారం వెలువడబోతోంది. దశాబ్దాలుగా వెంటాడుతున్న వివాదానికి తెర పడనుంది. 40 రోజుల వరుస విచారణ తర్వాత ఆయోధ్య కేసులో శనివారం పదిన్నర గంటలకు సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. సర్వోన్నత న్యాయస్థాన నిర్ణయం ఎలా ఉన్నా శిరసావహించాలని రెండు వర్గాల పెద్దలు పిలుపునిచ్చాయి. తీర్పుతో ఒకరు గెలిచినట్లు మరొకరు ఓడినట్లు కాదని.. సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను కోరారు.

Recommended For You