రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఆత్మహత్యాయత్నం

sucide

కొన్నేళ్లుగా తన భూ సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించడంలేదని ఓ వ్యక్తి విసుగు చెందాడు. తీవ్ర ఆవేదనతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి గాండ్లపెంట మండల కేంద్రంలో జరిగింది.

తుమ్మలబైలు గ్రామానికి చెందిన సురేంద్రనాయక్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ.. కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న రెవెన్యూ సిబ్బంది, స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. భూమికి సంబంధించి కోర్టు కేసు ఉందని, అది తేలే వరకు వేచి ఉండాలని అధికారులు చెప్పడంతో సురేంద్రనాయక్‌ శాంతించాడు.

Recommended For You