పరారీలో ఉన్న తహసీల్దారు కోసం కొనసాగుతోన్న పోలీసుల వేట

haseena

కర్నూలు జిల్లాలో పరారైన గూడూరు తహసీల్దారు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సురేష్‌ అనే వ్యక్తి నుంచి ఆమె 4 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. హసీనా లంచావతారంపై అతను ఏసీబీని ఆశ్రయించాడు. వాళ్లు అతనికి డబ్బులిచ్చి పంపారు. అయితే.. తహసీల్దారు హసీనా తెలివిగా వ్యవహరించారు. తనకు నమ్మకస్తుడైన బాషా అనే వ్యక్తి.. మరోచోట ఉన్నాడని.. అతనికి ముట్టజెప్పాలని చెప్పింది. ఆమె చెప్పినట్టే సురేష్..

బాషాకు లంచం డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనా ఎస్కేప్ అయింది. అప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు. కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు హసీనాను పట్టుకునేందుకు అధికారులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఎవరైనా ఆమెకు ఆశ్రయం కల్పిస్తే.. వాళ్లపైనా కేసులు తప్పవని హెచ్చరించారు.

Recommended For You