ఆంగ్ల బోధనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సురేష్

X

ఇంగ్లీష్ మీడియంలో బోధన పేద, మధ్య తరగతి విధ్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆంగ్ల బోధనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. ఒంగోలు సంతపేటలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. విద్యాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని.. అందుకు అనుగుణంగానే జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యను నిర్లక్ష్యం చేశారని మంత్రి సురేష్ విమర్శించారు. తమ ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని.. బడ్జెట్‌లో విద్యకు 16శాతం నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శమన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
