అనుమానంతో 8 నెలల కొడుకును చంపి.. ఆపై భార్యపై దాడి..

అనుమానంతో 8 నెలల కొడుకును చంపి.. ఆపై భార్యపై దాడి..

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకును నేలకేసి కొట్టి చంపాడు చిన్నపుల్లయ్య అనే ఓ వ్యక్తి. అంతేకాదు.. భార్యను సైతం కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రోకలి బండతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన రాచర్ల మండలంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన మహిళను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నపుల్లయ్య... తన భార్యను గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఆ అనుమానం పెనుభూతంగా మారింది. ఆమెపై తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నపుల్లయ్య..... ముందుగా కన్నకొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాతా భార్యపై సైతం దాడి చేశాడు. చిన్న పుల్లయ్యకు ఈమె రెండో భార్య.

గతంలోనే చిన్నపుల్లయ్య... లక్ష్మీదేవి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెపైనా అనుమానంతో హత్య చేశాడు. ఈ కేసులో 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు రెండో భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story