టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉషారాణి ప్రమాణం

usharani

టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉషారాణి ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుఢళ్వార్ సన్నిధిలో టీటీడీ అడిషన్‌ ఈవో ధర్మారెడ్డి…ఉషారాణి చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు పట్టువస్త్రాలతో ఆమెను సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి దేవస్థానంలో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు ఉషారాణి. ఏపీ ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా నిస్వార్ధంతో సేవలు అందిస్తానన్నారు.

Recommended For You