పక్కింట్లోనే శవమై తేలిన చిన్నారి

rape

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో 8 ఏళ్ల బాలిక కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. పక్కింట్లోనే బాలిక శవాన్ని గుర్తించారు పోలీసులు. ద్వారక అనే బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి పక్కఇంట్లోనే ఆ బాలిక శవమై తేలింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను ఎవరు చంపారు? చంపాల్సిన అవసరం ఏ ముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక మృతదేహం లభ్యమైన ఇంట్లో ఉంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసి హత్య చేశాడా? లేక ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Recommended For You