అమెరికాలో భారతీయులకు భారీ ఊరట

అమెరికాలో భారతీయులకు భారీ ఊరట

visa

అమెరికాలో భారతీయులకు భారీ ఊరట లభించింది. హెచ్‌-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు రద్దు చేస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారతీయులకు భారీ లబ్ధి చేకూరనుంది.

ఆమెరికాకు వలసదారులను తగ్గించటమే లక్ష్యంగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్..హెచ్-4 వీసా అనుమతులపై ఫోకస్ చేశారు. హెచ్-4 వీసాల నిబంధనలను కఠిన తరం చేశారు. దీంతో హెచ్-1బీ వీసాదారులపై గుండెల్లో బాంబు పేలినంత పనైంది. హెచ్-4 వీసా అనేది హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వామ్యులు కూడా ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే వీసా. అమెరికాలో 1.2 లక్షల మంది ఇలా ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయనే కారణంతో హెచ్-4 వీసాలను నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వామ్యుల ఉద్యోగాలు గల్లంతయ్యాయి.

ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.హెచ్-4 వీసాలను రద్దు చేస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని, ఉద్యోగ విధానాల్లో పారదర్శకత లోపిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ కొలంబియా సర్క్యూట్స్‌.. హెచ్‌-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు రద్దు చేస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటివరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని అభిప్రాయపడింది.

హెచ్-4 వీసాల కింద వేలాది భారతీయులు, ఇతర దేశాల వారు అమెరికా సంస్థల్లో పనిచేస్తున్నారు. హెచ్-1బీ వీసా తర్వాత హెచ్-4 వీసాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కోర్టు ఆదేశాలతో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరికింది.

Read MoreRead Less
Next Story