సాయం చేయండి: కేసీఆర్

cm-kcr

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌, ఉన్నతాధికారులు భగీరథ పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం గురించి కూడా కేంద్రమంత్రికి.. కేసీఆర్ వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను సీఎం కేసీఆర్‌ కోరారు.

Recommended For You