మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఉద్ధవ్‌ఠాక్రేకు శరద్ పవార్ ఫోన్

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఉద్ధవ్‌ఠాక్రేకు శరద్ పవార్ ఫోన్

sivasena-and-nsp

మరాఠా గడ్డపై కొత్త చరిత్ర లిఖించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగర్భ శత్రు వులు, అధికారం కోసం చేతులు కలుపుతున్నారు. శివసేన, ఎన్సీపీల మధ్య పొత్తు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ఫోన్ చేశారు. తాజా పరిణామాలపై చర్చించారు. సోమవారం వారిద్దరూ సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అటు, శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైపూర్‌లో భేటీ కానున్నారు. ఇక, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మల్లికార్జున ఖర్గే సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు భేటీ కానున్నారు.

మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఆహ్వానం లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కోషియారీ, శివసేనకు ఆహ్వానం పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై సోమవారం రాత్రి ఏడున్నర గంటల లోపు నిర్ణయం తెలపాలని ఆదేశించారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కోషియారీ చట్టబద్దంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా, అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ ముందుకు రాకపోవడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను పిలిచారు. శివసేన క్లైయిమ్ చేసుకుంటుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story