కత్తితో వీరంగం సృష్టించిన రౌడీ షీటర్

gagnulu

కర్నూలు జిల్లా నంద్యాలలో రౌడీ షీటర్‌ గంగు ఆనంద్‌ వీరంగం సృష్టించాడు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ఆనంద్‌.. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గంగు ఆనంద్‌ గతంలో నంద్యాల ఎస్పీజీ చర్చిలో సెక్రెటరీగా పనిచేశాడు. అనుబంధంగా ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర 80 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే  ఆ తర్వాత అతణ్ని చర్చి నుంచి బహిష్కరించడంతో ఉద్యోగాలు ఇప్పించడం కుదరలేదు. డబ్బుల కోసం బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వారు గంగు ఆనంద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే డబ్బులు చెల్లిస్తానని కోర్టులో ఒప్పుకున్న ఆనంద్‌.. తీరా బాధితులు ఇంటికి రాగానే వారిపై దాడికి పాల్పడ్డాడు.

Recommended For You