ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

latha-mangeshkar

భారతీయ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ (90) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలంగా ఆమె ఆయాసంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతితి నిలకడగానే ఉందని.. ఆమె కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

Recommended For You