గిరిజన విద్యార్థుల కోసం ఎన్నారైల నిధుల సేకరణ

VITI

తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విద్యార్ధుల చదువుకోసం నిధుల సేకరణకు అమెరికాలో ఎన్నారైలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి స్థాపించిన వీటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హ్యూస్టన్ లో కేటీ వీటీసేవా ఆలోక్ ఫండ్ రైజింగ్ పేరుతో నిధులను సేకరించారు. వీటీసేవా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్రెసిడెంట్ అపర్ణ కమటం తెలిపారు. ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలను అదిలాబాద్ జిల్లాలోని అల్లంపల్లి, బీర్సాయిపేట, ఏపీలో కటారువారి పాలేం గ్రామాల్లోని జీయర్ గురుకుల గిరిజన విద్యార్ధులకు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలతోపాటు పలువురు విద్యార్ధులు సైతం పాల్గొన్నారు.

Recommended For You