నూతన వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యువకుడు

sand-gift

పెళ్లికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్‌ పట్టుకెళ్తాం. కొత్త జంట కాపురానికి అవసరమయ్యే వాటిల్లో మనకు నచ్చింది కానుకగా చదివిస్తాం. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ పెళ్లిలో ఓ వ్యక్తి డబ్బాడు ఇసుకను గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని నీట్‌గా ప్యాకింగ్ మీద ప్యాకింగ్ చేసి మరీ తెచ్చాడు. తీరా దీన్ని ఓపెన్ చేశాక.. అవాక్కవడం, ఆపై నవ్వుకోవడం పెళ్లికొడుకు, పెళ్లికూతురు వంతయ్యింది. ఇసుకకు ప్రస్తుతం ఎంత కొరత ఉందో, ఎంత డిమాండ్ ఉందో చెప్పేందుకే ఇలా చేశానంటున్నాడు తలారివానిపాలెంకు చెందిన కాశీనాయుడు. ప్రత్యర్థులపై పంచ్‌కు ఇలా పెళ్లినే వేదిక చేసుకోవడాన్ని కొందరు తప్పుపట్టినా.. మరికొందరు మాత్రం ఈ తమాషా చూసి తెగ నవ్వుకున్నారు.

Recommended For You