హృతిక్ రోషన్‌పై అభిమానం.. భర్తను కూడా అలానే ఉండమనేసరికి..

Hrithik

అమ్మాయిలకు హీరోలు, అబ్బాయిలకు హీరోయిన్లు నచ్చడం మామూలే. ఏదైనా పరిధులు దాటనంతవరకు బాగానే ఉంటుంది. మరీ శృతి మించితేనే మొదటికే మోసం వస్తుంది. తన భర్తలో హృతిక్‌ని చూసుకోవాలని ఆశ పడింది ఓ ఇల్లాలు. అమెరికా న్యూయార్క్‌లో ఉంటున్న దినేశ్వర్, డోజోయ్‌లు భార్యాభర్తలు. దినేశ్వర్ సాప్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా, భార్య డోజోయ్‌ బార్‌లో ఉద్యోగం చేస్తోంది. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి భార్య హృతిక్ నామస్మరణ చేయడం భర్తకు ఓ పట్టాన నచ్చేది కాదు. మరీ అంత పిచ్చి పనికి రాదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చేవాడు. అయినా అవేవీ పట్టించుకునేది కాదు. పైగా నువ్వు కూడా అతడిలా కండలు పెంచొచ్చుగా అని భర్తను సతాయించేది. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చేది. ఆ పేరుతో భార్యను చిత్ర హింసలకు గురి చేసేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది డోజోయ్. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు అతడిని విచారించి నాలుగు రోజులు శిక్ష విధిస్తూ జైల్లో పడేశారు. దీనికంతటికీ కారణం భార్యేనని కుమిలిపోయాడు దినేశ్వర్. శిక్ష పూర్తి చేసుకున్న దినేశ్వర్ ఆవేశంతో ఇంటికి వెళ్లి భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. మరదలికి ఫోన్ చేసి మీ అక్కను చంపేశాను. డెడ్‌బాడీ ఇంట్లోనే ఉంది. ఇంటి తాళాలు పూల కుండీలో ఉన్నాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అక్కడి నుంచి దినేశ్వర్ ఊరి చివరన ఉన్న పొలాల్లోకి వెళ్లాడు. ఓ చెట్టుకు ఉరి వేసుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Recommended For You