వీళ్లని మార్చడం ఎవరి తరం కాదు.. డెత్ సర్టిఫికెట్‌కీ లంచం డిమాండ్..

వీళ్లని మార్చడం ఎవరి తరం కాదు.. డెత్ సర్టిఫికెట్‌కీ లంచం డిమాండ్..

soujanya

పేదవాడి కడుపు మండితే ఏం చేస్తాడో ప్రత్యక్షంగా చూస్తున్నారు. అయినా అలవాటు పడ్డ ప్రాణం అలాంటివేవీ పట్టించుకోదు. చేయి తడవందే ఫైలు కదలదు. అధికారుల అవినీతి బాగోతాలు ఎన్ని బయటపడ్డా యధా మామూలే. లక్షల్లో జీతాలున్నా అవినీతి సొమ్ముకి ఆశపడుతూ లంచాలు పుచ్చుకుంటారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో చోటు చేసుకున్న ఈ ఘటన అధికారులు ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారో అద్ధం పడుతోంది. భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు. మృతుడి భార్య బేబీ డెత్ సర్టిఫికెట్ కోసమని మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది. విచారణ నిమిత్తం ఆ పత్రాలు భీమడోలు ఆర్‌ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. వీటికోసం బేబీ ఆర్‌ఐని సంప్రదించగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బేబీ ఆరోపించారు. తాను అంత ఇచ్చుకోలేనంటే కనీసం రూ.3 వేలైనా ఇవ్వందే సర్టిఫికెట్ ఇచ్చేది లేదన్నారట. కాగా, బేబీ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.. రంగంలో దిగిన ఏసీబీ అధికారులు బేబీ నుంచి లంచం తీసుకుంటున్న సౌజన్యా రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read MoreRead Less
Next Story