విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

pawan-kalyan

విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో పుస్తక ప్రదర్శనను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రారంభించారు. అక్కడున్న వివిధ రకాల బుక్స్‌ పరిశీలించి కొన్నింటిని కొనుగోలు చేశారు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి, ఫౌంటెన్ హెడ్ వంటి పలు పుస్తకాలు సొంతం చేసుకున్నారు. అక్కడ సిబ్బందిని అడిగి కొన్ని బుక్స్ గురించి ఆరా తీశారు.

పవన్ మొదట్నుంచి పుస్తకాలు ఎక్కువ చదువుతారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు ముందు వేసుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలోనే ఇవాళ పుస్తక ప్రదర్శనకు ఆయన్ను ఆహ్వానించింది విశాలాంధ్ర యాజమాన్యం. ఆ వెంటనే వచ్చి బుక్స్‌ పరిశీలించారు పవన్ కల్యాణ్.

Recommended For You