రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా స్పీకర్ నిర్ణయాలు పెరుగుతున్నాయి: సుప్రీం కోర్టు

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా స్పీకర్ నిర్ణయాలు పెరుగుతున్నాయి: సుప్రీం కోర్టు

su

కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పీకర్‌ తీసుకున్న అనర్హత వేటు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే.. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు.. అంటే 2023 వరకు.. వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదంటూ.. సభాపతి విధించిన నిషేధాన్ని మాత్రం కొట్టివేసింది. డిసెంబర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో వారికి పోటీ చేసే అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

కర్నాటక అనర్హత ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుకు సంబంధించిన నిజానిజాలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తీర్పు చెప్పామని తెలిపింది. అనర్హత వేటు వేసే విషయంలో సభాపతి అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని.. అదే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్పీకర్‌ నిర్ణయాలు తీసుకోవడం పెరుగుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ ఏడాది జులైలో కర్నాటక ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. అధికారంలోని కాంగ్రెస్‌-JDS కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఈ సందర్భంలో.. విప్‌ ధిక్కరించారంటూ 17 మంది ఎమ్మెల్యేలపై.. నాటి స్పీకర్ రమేష్‌కుమార్ అనర్హత వేటు వేశారు. 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై నిషేధం విధించారు. దీంతో.. ఆ 17 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ NV రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అక్టోబర్ 25న తీర్పును రిజర్వ్‌ చేసింది. బుధవారం వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story