శబరిమల తీర్పుపై ఉత్కంఠ

 

sabarశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉంటాయని ఆలయంలోకి అందరూ ప్రవేశించ వచ్చని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. ఐతే.. ఈ తీర్పును సమీక్షించాలంటూ 64 మంది పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపై విచారణ జరిపింది. వీటిపై మరోసారి కోర్టు తీర్పు ఇవ్వనుంది. గతంలో తీర్పు తర్వాత కొందరు మహిళలు సన్నిధానానికి వెళ్లినా.. అది పలు ఆందోళనలకు కారణమైంది. ఈ నేపథ్యంలో గురువారం కోర్టు ఏం చెప్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ చంద్రచూడ్, జస్టీస్ రోహింగ్టన్ నారీమన్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రలు విచారిస్తున్నారు. గతంలో తీర్పుతో జస్టిస్ ఇందూ మల్హోత్రా విబేధించారు. అయినా మెజార్టీ న్యాయమూర్తుల అభిప్రాయంతో తీర్పును వెలవరించారు. తాజాగా దేవాశ్వం బోర్డు ప్రతిపాదనలు కూడా కీలకంగా మారాయి. గతంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫడవిట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం.. మహిళలకు అవకాశం ఇవ్వడంలో తప్పే లేదని అఫడవిట్ దాఖలు చేసింది.

అయితే సంప్రదాయవాదులు, ఆద్మాత్మిక వేత్తలు గతంలో వచ్చిన తీర్పుతో విబేధించారు. శతాబ్ధాలుగా ఆచారంగా వస్తున్న కట్టుబాట్లను కాదని.. మహిళలకు అవకాశం కల్పించడం సరికాదంటున్నారు. బలవంతంగా అమలు చేయడం కంటే.. ఆచారాలను కొనసాగించడం మంచిదని సూచిస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు, సంప్రదాయాలను గౌరవిస్తూ తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Recommended For You