సన్ రైజ్ ఏపీ కాస్తా.. సూసైడ్ ఏపీగా మారింది : నారా లోకేశ్

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సన్ రైజ్ ఏపీ కాస్తా...సూసైడ్ ఏపీగా మారిపోయిందని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. రాష్ట్రంలో భవననిర్మాణ కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ 6 నెలల కాలంలో జగన్ సాధించింది కక్ష సాధింపులు, కేసులు మాత్రమే అన్నారు లోకేశ్. ఇప్పటి వరకు 610 మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని..అందరికీ అండగా ఉంటామని చెప్పారు లోకేష్..
వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై నారా లోకేశ్ స్పందించారు. కొద్దిరోజుల క్రితం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వేధింపులకు పాల్పడుతోందని చెప్పిన వ్యక్తి... ఇప్పుడు మాపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసులకు భయపడి ఒకరు, ఆస్తుల భయంతో మరొకరు పార్టీ మారారని వంశీ, అవినాష్‌లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్న వంశీ ముందుగా పార్టీకి రాజీనామా చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు...ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
అంతకుముందు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. YCP నేత కాళ్లు పట్టుకోలేదని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారంటూ కార్తీక్ కుటుంబ సభ్యులు బోరుమన్నారు. లోకేశ్... వారికి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరుకి చేరుకుని కేసుకు సంబంధించి రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డితో చర్చించారు లోకేష్ . సివిల్ విషయాల్లో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టడమేంటని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com