రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

anil-ambani

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారని అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్ సంస్థ శనివారం ప్రకటన చేసింది. అంబానీతో పాటు చాయా విరాని, రినా కరణి, మంజారి కాకర్, సురేష్ రంగాచార్ ఆర్‌కామ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. “శ్రీ మణికాంతన్ వి. ఇంతకుముందే కంపెనీ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. పైన పేర్కొన్న రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి వారి పరిశీలన కోసం ఉంచింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో కొనసాగుతున్న ఆర్‌కామ్, చట్టబద్దమైన బకాయిలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత.. 2019 జూలై-సెప్టెంబర్‌లో, 30,142 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది.

Recommended For You