ఆరునెలల్లో రాష్ట్రాన్ని ముంచిన సీఎంగా పేరు తెచ్చుకున్నారు: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్.. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారన్నారు. ఇందుకు పత్రిక కథనాలే నిదర్శనమన్నారు. తనమీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. జగన్‌పై ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ట్యాగ్ చేశారు చంద్రబాబు.
ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి ఈ పత్రికాకథనాలే నిదర్శనం. నా మీద కక్షతో నేను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి. pic.twitter.com/WSPjGniySz
— N Chandrababu Naidu (@ncbn) November 16, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com