చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

chitture

చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని వీడింది.ఈ కేసులో నిందితుడైన లారీ డ్రైవర్ రఫీని ఛత్తీస్‌గడ్‌లోఅరెస్ట్ చేశారు పోలీసులు. మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. చిన్నారి వర్షితకు చాక్లెట్ ఆశ చూపించి రఫీ తన వెంట తీసుకెళ్లాడని, అత్యాచారం చేసి ఆపై హతమార్చినట్లు తెలిపారు ఎస్పీ సెంథిల్‌ కుమార్. సీసీటీవీ ఫుటేజీ, ఊహాచిత్రాల సాయంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు.

రఫీ స్వస్థలం మదనపల్లె మండలం బసినికొండ. బాల నేరస్థుడుగా జైలు జీవితం గడిపాడని పోలీసులు తెలిపారు. గతంలోనూ చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డాడని,ఓ కేసులో 2 నెలలు జైల్లో ఉండి వచ్చినట్లు తెలిపారు. ప్రవర్తన సరిగా లేదని భార్య వదిలేసి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి జులాయిగా తిరుగుతున్నాడన్నారు పోలీసులు. వర్షితని దారుణంగా హత్య చేసిన అనంతరం.. గుర్తుపట్టకుండా గుండు గీయించుకుని తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలిపారు పోలీసులు

ఈ నెల 7వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్ లోని బంధువుల పెళ్లికి వెళ్లింది వర్షిత. అప్పటివరకూ కల్యాణమంటపంలో సరదాగా ఆడుకుంటూ కనిపించిన వర్షిత.. అర్థరాత్రి కనిపించకుండా పోయింది. దీంతో తెల్లవార్లూ వెదికారు తల్లిదండ్రులు. కాని ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరకు కల్యాణమంటపం సమీపంలోనే వర్షిత విగతజీవిగా కనిపించింది..

ఈకేసుపై స్పందించిన సీఎం జగన్‌... నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. దీంతో స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు పోలీసులు. సీసీ కెమెరా, ఊహచిత్రాలు, ఫోన్‌ కాల్స్‌తో నిందితుడి కోసం గాలించారు. చివరికి రఫిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story