ఫేక్ అకౌంట్‌తో ఫేస్‌బుక్‌లో 25 మందిని..

విశాఖలో వైద్యుడిగా చలామణి అవుతూ.. ఫేస్‌బుక్ ద్వారా మహిళల్ని ట్రాప్ చేస్తున్న మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 25 మందిని ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. కంచరపాలెంకు చెందిన కుమార్.. రైల్వేలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకునేవాడు. అలా ట్రాప్‌లో చిక్కుకున్నవాళ్లతో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను బయటపెడతానని బెదిరించి డబ్బు వసూలు చేసేవాడు. అంతటితో ఆగకుండా వారి స్నేహితుల్ని కూడా తన లైంగిక వాంఛలను తీర్చమని ఒత్తిడి చేసేవాడు.
సుమారు 6 నెలలుగా కుమార్ చాలా మందిని వేధించాడు. ఈ కేటుగాడి వలలో పడ్డ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుమార్ వేధింపులు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com