ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం : వల్లభనేని వంశీ

VAMSI_2

టీడీపీ నేతలకు మరోసారి కౌంటర్‌ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని వంశీ ప్రకటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నిచంఆరు. మీరంతా రాజీనామా చేయండి.. అప్పుడు తనను ప్రశ్నించాలని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ తనపై విమర్శలు చేయడంతో.. కాస్త కంట్రోల్‌ తప్పి మాట్లాడానని వంశీ ఒప్పుకున్నారు. గతంలో తనపై విమర్శలు చేసిన వెబ్‌ సైట్లపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరితే ఎందుకు స్పందించలేదని వంశీ ప్రశ్నించారు.

Recommended For You