పొర్లు దండాలు పెట్టి.. వినూత్నంగా నిరసన తెలిపిన రాయలసీమ వాసులు

 

SRI

కడపలో రాయలసీమ వాసులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం జరిగి నేటికి 82 ఏళ్లు పూర్తయ్యాయని.. అయినా పాలక ప్రతిపక్షాలు రాయలసీమపై వివక్ష చూపిస్తున్నాయని విమర్శించారు ఏపీ విభజన హామీల ప్రత్యేక హోదా సమితి నేతలు. అప్పటి శ్రీబాగ్‌ ఒప్పందంలో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కోటిరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కడప కోటిరెడ్డి సర్కిల్‌లో ఆయన విగ్రహం ఎదుట పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మనసు మార్చి రాజధాని, హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేసేలా చేయాలని కోరారు.

Recommended For You