ఎన్ని తిప్పలో.. కిటికీలో నుంచే దరఖాస్తులు..

అలవాటు పడ్డ ప్రాణం.. అయినా భయం.. కొన్ని రోజులు ఇలానే ఉంటుంది. ఆ తరువాత అందరూ మర్చిపోతారు. మళ్లీ కథ మొదటికే. రెవెన్యూ అధికారిణి విజయారెడ్డి హత్యోదంతంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. బతికుంటే బలుసాకు తినొచ్చు అని అనుకున్నా.. చేయి ఎందుకో దురద పెడుతుంటుంది. లంచం తీసుకోందే ఫైలు కదపొద్దు అని మనసు గొడవ చేస్తుంటుంది. కానీ ఎవరి చేతిలో ఏముందో అని భయం మాత్రం పని చేయిస్తే ఒట్టు. గీత దాటి రావద్దు అని ఒకరు, తాడు కట్టి మరొకరు, ఇకపై కిటికీలో నుంచే మీ లావాదేవీలన్నీ అని మరొకరు.. ఇలా ఎన్నెన్నో వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నీతి నిజాయితీగా పని చేస్తే భయమెందుకండీ అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో కిటికీ నుంచి దరఖాస్తులు తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. తమ కార్యాలయంలోకి వచ్చిన ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు అధికారులు. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్లవలసి వస్తే వాళ్లని కింద నుంచి పై వరకు చెక్ చేసిన తరువాత మాత్రమే లోపలికి రమ్మంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com