వంశీ పదవికి రాజీనామ చేసి పార్టీ మారాలి: స్పీకర్ తమ్మినేని

 

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవన్నారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే చెప్పారని.. దానికే తాను కట్టుబడి ఉన్నానన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

Recommended For You