చదువులో స్టేట్‌ ర్యాంక్‌ వచ్చిన వ్యక్తి హుందాగా మాట్లాడాలి : టీడీపీ

vam

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయ్యప్పమాల వేసుకుని వంశీ వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.

టీడీపీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన వ్యక్తులు.. ఇప్పుడు ఆ పార్టీ అధినేతనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబును తిడితే వైసీపీ మేక తోలు కప్పుతుందనుకుంటున్నారా అని వంశీని ఉద్దేశించి ప్రశ్నించారు. చదువులో స్టేట్‌ ర్యాంక్‌ వచ్చిన వ్యక్తి హుందాగా మాట్లాడాలని సూచించారు.

అటు టీడీపీ నేతల విమర్శలపై మరోసారి రియాక్టయ్యారు వల్లభనేని వంశీ. రాజేంద్రప్రసాద్‌లా తనకు సౌమ్యంగా మాట్లాడడం రాదంటూ కౌంటర్‌ ఇచ్చారు. నా భాష, వేషం మొరటుగానే ఉంటుందన్నారు వంశీ. రాజీనామా చేయమని తనను అడిగే అధికారం లోకేష్‌కు ఎక్కడుందని ప్రశ్నించారు. టోటల్‌గా టీడీపీ నేతలు- వంశీ మధ్య మాటల యుద్ధంతో ఏపీ రాజకీయం హాట్‌ హాట్‌గా మారింది.

Recommended For You