వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలపై టీడీపీ నేతల ఆగ్రహం

vamsi-tdp

వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు టీడీపీ నేత దేవినేని ఉమా. తమను తిట్టడానికి 150 మంది ఎమ్మెల్యేలు చాలదా అని జగన్‌ను ప్రశ్నించారు.

అటు టీడీపీ నేత బోడే ప్రసాద్‌ కూడా వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై వంశీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడన్న వంశీ ఆరోపణలను ఖండిస్తున్నానని తెలిపారు బోడే ప్రసాద్.

Recommended For You