సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసు చేధించిన పోలీసులు

BABY

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసును చిత్తూరు జిల్లా పోలీసులు చేధించారు. నిందితుడు బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీగా గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులతో కలిసి కురబాల కోటలో ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల వర్షిణి దారుణ హత్యకు గురైంది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్యాణమండపంలో సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి వర్షిని అర్థరాత్రి సమయానికి కనిపించకుండా పోయింది. తెల్లవార్లూ వెతికినా అమె ఆచూకీ దొరకలేదు. ఉదయం కళ్యాణమండపం సమీపంలోనే వర్షిని విగతజీవిగా పడి ఉంది.

Recommended For You