కర్నూలులో వైసీపీ కార్యకర్తలు దాడి.. నలుగురికి తీవ్రగాయాలు

కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తాగునీరు సరఫరా చేయమన్నందుకు కాలనీవాసులపై దాడి చేశారు. కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బోరు స్టాటర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా కాలనీకి తాగునీరు అందడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో కాలనీవాసులే స్టాటర్ బిగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ అనుమతి లేకుండా స్టాటర్ ఎలా బిగిస్తారని వైసీపీ కార్యకర్తల దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే.. మా సమస్య మేమే పరిష్కరించుకోవటం తప్పా అని అంటున్నారు.

Tags

Next Story