ఆ చెట్టుని తాకితే రోగాలు మాయం!

ఆ చెట్టుని తాకితే రోగాలు మాయం!

Magical-Mahua-tree

హాస్పటల్‌లో ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా నయంకాని జబ్బులు.. ఓ చెట్టును తాకితే చిటికెలో మటుం మాయం అవుతాయట. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజమే. ఆ మహిమ గల చెట్టుని తాకితే రోగాలు మాయం అవుతాయనే ప్రచారం మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతల్లోని ప్రజలు ఆ చెట్టును తాకటానికి పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకూ సుమారు 10 లక్షల మంది ఆ చెట్టును తాకి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న పేషెంట్లు కూడా చెట్టును తాకేందుకు స్ట్రెచర్‌పై వస్తుండటం విశేషం.

హోసంగబాద్‌ జిల్లాలోని సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆ చెట్టు ఉంది. ప్రతిరోజు వేలాది మంది ఆ చెట్టును దర్శించుకుంటున్నారు. అద్భుతంగా శక్తులున్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు పేరు 'మహువా'.

ఇక 'మహువా' మహిమల విషయం పక్కన పెడితే.. కొందరు స్థానికులు మాత్రం ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ చెట్టు సమీపంలో కొందరు దుకాణాలు పెట్టేశారు. కొబ్బరి కాయలు, అగరబత్తులు, హోటల్స్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్టు మార్గంలో దాదాపు 300పైగా దుకాణాలు తెరిచారు. తేలికగా సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది చెట్టుకు మహిమలు ఉన్నట్లు కట్టుకథను ప్రచారం చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ప్రాంతం వేల సంఖ్యలో జనాలు రావడంతో చెత్తాచెదారం పేరుకుపోతోందని.. వేలాది మంది ఇలా తరలిరావడం వల్ల అడవిలోని జంతులకు హాని కలుగుతుందని అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story