ఆసుపత్రిపాలైన ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్ జహాన్

nusrat

ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్ జహాన్ ఆసుపత్రి పాలయ్యారు. శ్వాసతీసుకోవడంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవడంతో ఆమెను కోల్ కత్తా లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నుస్రత్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని, సోమవారం డిశ్ఛార్జ్ చేస్తారని నుస్రత్ జహాన్ ప్రతినిధి అభిషేక్ మజుందార్ తెలిపారు. అయితే మాదకద్రవ్యాల అధిక మోతాదు కారణంగా ఆమె ఆసుపత్రిపాలవ్వాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా నటిగా రాణిస్తున్న నస్రత్ జహాన్పశ్చిమబెంగాల్ రాష్ట్రం బషీర్ హత్ నుంచి తృణముల్ కాంగ్రెస్ తరుపున ఆమె ఎంపీగా గెలుపొందారు.

Recommended For You