రాజ్యమేలుతున్న గంజాయి స్మగ్లర్లు

రాజ్యమేలుతున్న గంజాయి స్మగ్లర్లు

smuggler

ఏపీ గంజాయి మత్తులో జోగుతోంది. విచ్చలవిడిగా రవాణా అవుతోంది. విద్యార్ధులు, యువతే లక్ష్యంగా స్మగ్లర్లు యధేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు సైతం ఈ పాపంలో చేతులు కలుపుతున్నారు. ఇటీవల పలుమార్లు జరిగిన తనిఖీల్లో పోలీసులు సైతం గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.

ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న గంజాయికి యువత ఎడిక్ట్ అవుతున్నారు. విద్యార్ధులు ఒకరి నుంచి ఒకరికి అలవాటు అయి.. మత్తులో జోగుతున్నారు. వీకెండ్ పార్టీల్లో గంజాయి ఓ స్పెషల్ గా మారింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి వంటి నగరాల్లో ఈ జాడ్యం మరింత పెరుగుతోంది. గంజాయి అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖమన్యంలో పెద్ద ఎత్తున పండిస్తున్నారు గంజాయి. ఎకరానికి 20 వేలు అడ్వాన్స్ లు ఇచ్చి మరీ గిరిజనుల చేత గంజాయి సాగు చేయిస్తున్నారు. తమిళ స్మగ్లర్లు మన్యంలో మకాం వేసి.. హుకుంపేట, అనంతగిరి, పాడేరు, డుంబ్రిగూడ, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టుగ, జి.కే.వీది ఏజన్సీ మండలాల్లో విరివిగా సాగు చేయిస్తున్నారు. ఒక్కో మండలంలో కనీసం 20 గ్రామాలకు తగ్గకుండా వేలాది ఎకరాల్లో గంజాయి సాగవుతోంది.

గంజాయి సాగవుతున్న ప్రాంతాలు మావోయిస్ట్ ప్రాభల్య ప్రాంతాలు కావడంతో ఏమీ చేయలేకపోతున్నారు పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు. గిరిజనుల ఆధ్వర్యంలోనే కాలినడకన మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణా, తమిళనాడు, ఒడిశా, కేరళా ప్రాంతాలకు తరలిస్తారు. గంజాయిని తరలించడానికి పోలీసులు, విద్యార్ధులు, యువతను.. గంజాయి స్మగ్లర్లు వాడుకుంటున్నారు. పోలీసులకు డబ్బులు ఆశచూపి లొంగదీసుకుంటుంటే, విద్యార్ధులను, యువతను గంజాయికి బానిసలుగా చేసి వశపరచుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story