శవపేటికలో వచ్చిన పెళ్లి కుమార్తె

marr

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. అది చూసే వాళ్లకి కొంచెం వింతగా అనిపించినా.. మళ్లీ మాట్లాడితే కొంచెం వింతేంటి.. బోలెడు వింత.. కాకపోతే మరణించిన వాళ్లని ఉంచే శవపేటికలో.. హాయిగా నిక్షేపంలా పెళ్లి చేసుకుని బోలెడు జీవితాన్ని అనుభవించ వలసిన పెళ్లి కూతురుని ఈ విధంగా తీసుకురావడం వింతలకే వింత మరి. వాళ్లు మాత్రం ఈ పిచ్చిని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఘటనే.. ఓ పెళ్లి వేడుకలో జరిగింది. సాధారణంగా.. పెళ్లిలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆర్కెస్ట్రా, డాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. అందులో వధూ, వరులు కూడా కాసేపు డాన్స్ చేసి అలరిస్తూ.. ఉంటారు. అలాగే ఓ పెళ్లిలో వధువు డాన్స్ చేసింది. అయితే.. డాన్స్ చేసే ముందు పెళ్లి కుమార్తె ఎంటర్ అయిన విధానం చూస్తే.. ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

సినిమాల్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీకి దర్శకులు కూడా ఇంతగా ఆలోచించరేమో. పెళ్లి కుమార్తె అంటే.. ఏ కారులోనో.. లేక పోతే రథం మీదో.. మరి కొంత మందైతే ఏనుగు మీద కూడా వస్తుంటారు. కానీ, ఈ పెళ్లి కూతురు మాత్రం శవపేటికలో వచ్చింది. అవునండీ.. మీరు చదివింది నిజమే. వెనక్కి వెళ్లి.. చదవాల్సిన అవసరం లేదు. శవపేటిక లోనే.. వచ్చింది. ఆ శవ పేటికపై నల్లని వస్త్రం ఉంది. ఆ వస్త్రాన్ని తొలగించి.. ఆ శవపేటికను తెరవడానికి అక్కడున్న ఓ వ్యక్తి చేసిన హడావుడి అంతా ఇంతకాదు. మెజీషీయన్ మ్యాజిక్ చేసినట్టుగా ఓ రేంజ్ లో పెర్మామెన్స్ ఇచ్చాడు. తరువాత శవపేటికను తెరిస్తే.. అందులోంచి నవ్వుకుంటూ.. డాన్స్ చేస్తూ.. ఒకింత సిగ్గుపడుతూ పెళ్లి కుమార్తె బయటకి వస్తుంది.

కొత్తదనం కోసం అలా చేశారో.. మరి సాంప్రదాయంలో భాగంగా అలా చేశారో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Recommended For You