జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటానికి కారణం చెప్పిన బోండా ఉమ

ntr

జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వైపు రాకపోవడానికి కారణం కొడాలి నాని, వంశీలే అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కొడాలి నాని, వంశీలు అన్ని విధాలా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్‌ చదువుతున్నారో అందరికీ తెలిసిందే అన్నారు. కొందరు వలస పక్షలు ఎవరు అధికారంలో ఉండే వారి పక్షాన చేరుతారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రులు మాట్లాడడం సరికాదని.. వెంటనే కొడాలి నానితో సీఎం క్షమాపణలు చెప్పించాలి బోండా ఉమ డిమాండ్ చేశారు.