క్లీన్ హైదరాబాద్ కోసం.. జీహెచ్ఎంసీ ఈ-ఫైన్

క్లీన్ హైదరాబాద్ కోసం.. జీహెచ్ఎంసీ ఈ-ఫైన్

ghmc

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు డ్రైవ్ కొనసాగుతోంది. అక్రమ బ్యానర్లు, పోస్టర్లను కూడా తీసేస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు 15వేలకు పైగా ఫ్లెక్సీలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం తెలిపింది. అటు ఈ అక్రమ బ్యానర్లను నివారించేందుకు.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ.

హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది జీహెచ్‌ఎంసీ. అయితే ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఇకపై నిబంధనలు అతిక్రమించిన వారికి.. ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు అధికారులు. నగరంలో ఇప్పటి వరకు విధించిన జరిమానాల స్థానంలో.. కొత్తగా ఈ- ఫైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కసారి చలాన్ వేస్తే.. దానిని తిరిగి తొలగించే పరిస్థితి ఉండదంటున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story