ఘనంగా ప్రారంభమైన IFFI వేడుకలు

 

iffi50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో కలర్‌ఫుల్‌గా ప్రారంభమయ్యాయి. ఈనెల 28 వరకు జరిగే ఈ ఫిల్మోత్సవ్‌ను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రదానం చేశారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా హాజరయ్యారు. IFFI లో తొలిసారి కొంకణి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన 190కి పైగా సినిమాలు ఫిల్మోత్సవ్‌లో ప్రదర్శించనున్నారు. ఫ్రెంచ్ నటి ఇసబెల్లె హుపెర్ట్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రధానం చేయనున్నారు. 50 ఏళ్లు పూర్తయిన 11కు పైగా చిత్రాలను కూడా IFFIలో టెలికాస్ట్‌ చేయనున్నారు.