వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు

vam

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. గతంలో జగన్ ను తిట్టిన వంశీ ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. అన్నం తిన్న వారెవరూ వైసీపీలో ఉండరని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏ కారణాలతో వైసీపీలోకి వెళ్తున్నారని నిలదీశారు. గతంలో వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తేడా చూపిస్తూ.. ఓ విడీయో మీడియాకు రిలీజ్ చేశారు..

గురువారం ఓ లైవ్ లో బాబూ రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. కేవలం రాజేంద్ర ప్రసాద్ ను బెదిరించడానికే అలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడడానికి.. ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ పార్టీ వీడారని ఆరోపించారు..

అధినేత చంద్రబాబును, లోకేష్ ను విమర్శించే స్థాయి వంశీకి లేదన్నారు టీడీపీ నేత పంచమర్తి అనురాధ. అసలు లోకేష్ పై ఇంత తీవ్రంగా విమర్శలు చేయడానికా కారణాలు ఏంటో తెలీదన్నారు. లోకేష్ కి .. జగన్ కి చాలా తేడా ఉందని పంచమర్తి రాధ అన్నారు.