అస్తికలను కృష్ణానదిలో కలిపిన దిశ తండ్రి

disa-father

తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని షూట్‌ చేయాలని దిశ తండ్రి డిమాండ్‌ చేశారు. కూతురి అస్తికలను జోగులాంబ గద్వాల్‌ జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో కలిపిన ఆయన.. నిందితులను నడిరోడ్డుపై కాల్చి చంపినప్పుడే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందన్నారు.

బీచుపల్లి కృష్ణానదిలో స్నానం చేసి.. అక్కడి కోదండరాముల వారిని దర్శ చేసుకోవాలి అనుకుంటే.. తన బిడ్డ ఆస్తికలను కలపాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే ఆ నీచులను కాల్చివేసి మరే బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలన్నారు.

Recommended For You