కేసీఆర్‌కు దొరకని ప్రధాని అపాయింట్‌మెంట్‌

cm

విభజన సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు హస్తిన వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తరువాత రాష్ట్ర సమస్యలపై ప్రధాని సహా, పలువురు కేంద్రమంత్రులను కలవాలి అనుకున్నారు. కానీ ఎవరి అపాయింట్‌ దొరకకపోవడంతో ఆయన వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళవారం హస్తిన వెళ్లిన ఆయన.. తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి యత్నించారు. వీటిపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించారు. పూర్తి నివేదికలతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినా.. పార్లమెంట్‌లో ఎస్పీజీ బిల్లుపై కీలక చర్చ ఉండడంతో.. అపాయింట్‌మెంట్ దొరకలేదని తెలుస్తోంది. బుధవారం కలిసేందుకు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Recommended For You