తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్

pawan-kalyan

తిరుపతిలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా వంటి నేతలే ఈ దేశానికి అవసరం అన్నారు. అమిత్‌ షా ఉక్కుపాదంతోనే మాట్లాడుతారని అన్నారు. మెతకగా మాట్లాడితే మనుషులు వినరని వ్యాఖ్యానించారు పవన్. కులాన్ని, మతాన్ని ప్రాంతాన్ని ఇష్టా రాజ్యానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాయలసీమలోకి ఎవరూ రావొద్దని దోరణితో గ్రూపులు కట్టారని ఆరోపించారు పవన్.

అటు పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రి పేర్నినాని. పవన్ జనసేన పార్టీని బీజేపీలో కలుపుతారని ఆరోపించారు. అందుకే మోదీ, అమిత్‌షాను పొడుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Recommended For You