తప్పిన పెనుప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు

train

కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద.. తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనుక ఉన్న జనరల్‌ బోగి పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Recommended For You