మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డుని ఈ నెలాఖరులోపు..

sbi

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మ్యాగ్‌స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతున్న వాటిని అరికట్టే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లు వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని అంటోంది.

దీంతో మోసాల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపింది. ఎలాంటి రుసుము చెల్లించకుండానే పాత కార్డు స్థానంలో కొత్త కార్డు పొందవచ్చని బ్యాంకు వివరించింది. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదా బ్యాంకుకు వెళ్లైనా పని పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఎస్‌బీఐ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కరెంట్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలి. మీరిచ్చిన అడ్రస్ ప్రకారం మీకు పోస్టులో కొత్త ఈఎంవీ చిప్ కార్డు మీ ఇంటికే వస్తుంది. అందువలన అడ్రస్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.


 


Recommended For You