చట్టం కళ్లు తెరిచింది.. అక్కడి మృగాడికి శిక్షపడింది..

చట్టం కళ్లు తెరిచింది.. అక్కడి మృగాడికి శిక్షపడింది..

jugment

గుడ్డి కంటే మెల్ల నయం అని ఓ సామెత చెప్పినట్టు కామాంధుల కాళ్లు చేతులు విరగ్గొట్టి కాలవలో పడేయక.. కఠిన కారాగార శిక్ష అమలు చేసింది. ఆ మృగాడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఏళ్లకి ఏళ్లు సాగే తీర్పులు రెండేళ్లు పూర్తవకుండా బాధితులకు న్యాయం చేసింది. వరుసకు కుమార్తె అయ్యే 15 ఏళ్ల బాలికపై కళ్లు మూసుకు పోయిన 54 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు అతడికి కోర్టు శిక్ష విధిస్తూ తీర్సు చెప్పింది.

కృష్ణా జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన సైకం కృష్ణారావు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తుండేవాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఆమె పెద్ద కుమార్తెపై కృష్ణారావు కన్నేశాడు. 2018 జనవరి 27న ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని అమ్మకు వివరించింది. ఆమె కృష్ణారావుని నిలదీయడంతో తల్లీ కూతుళ్లను బెదిరించి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. పూర్వాపరాలు విచారించిన కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి జి.ప్రతిభాదేవి సోమవారం తీర్పు చెప్పారు. సోమవారం తీర్పు చెప్పారు.

Read MoreRead Less
Next Story