55ఏళ్ల మహిళ అనుమానాస్పద మృతి..

dead

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నాగమణి అనే 55 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఐ.పోలవరం మండలం జీ వేమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారం చల్లి ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇంట్లో మంచం మీదే చనిపోయింది నాగమణి. ఉదయం పక్కింటి మహిళ.. నాగమణి ఇంటికి వెళ్లగా ఆమె చనిపోయి ఉండటంతో.. పోలీసులకు సమాచారమిచ్చింది. గత కొంతకాలంగా ఆమె ఒంటరిగా ఉంటోందంటున్నారు స్థానికులు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Recommended For You