వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో విచార‌ణ వేగ‌వంతం..

YS-Vivekananda-Reddy-murder-6

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును సిట్‌ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్‌ రెడ్డి ఇంకా కొంతమందిని సిట్‌ అధికారులు విచారించారు. కడప నగర శివారులోని జిల్లా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో విచారణ చేపట్టారు. అలాగే టీడీపీ నాయకుడు మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌ను కూడా విచారిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి సాధించేందుకు ఇంకా కొంతమంది నాయకులను కూడా సిట్‌ విచారణ చేయనుంది.

Recommended For You