రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా..? : మేకతోటి సుచరిత

home-minister-sucharitha

దిశ ఘటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఫైర్‌ అయ్యారు. దిశ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్‌ కళ్యాణ్ అనడం చూస్తుంటే..

ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోంది అన్నారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా..? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా నాయకుడు అని చెప్పుకునే పవన్‌ ఇలాగేనా మాట్లాడేది అని మండిపడ్డారు. అసలు పవన్‌ ఇప్పుడు ఏ పార్టీతో ఉన్నారో చెప్పాలి అన్నారు హోంమంత్రి సుచరిత.

Recommended For You